శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 21 డిశెంబరు 2017 (12:34 IST)

'హలో' చూశా... అఖిల్ వాళ్ల బంగారం... చిరంజీవి

అక్కినేని అఖిల్ హలో చిత్రం రేపు డిశెంబరు 22న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిన్న హైదరాబాదులో ప్రి-రిలీజ్ ఫంక్షన్ జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... హలో చిత్రాన్ని నేను చూశాను. ఏదైనా ఓ చిత్రాన్ని విడుదలకు

అక్కినేని అఖిల్ హలో చిత్రం రేపు డిశెంబరు 22న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిన్న హైదరాబాదులో ప్రి-రిలీజ్ ఫంక్షన్ జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... హలో చిత్రాన్ని నేను చూశాను. ఏదైనా ఓ చిత్రాన్ని విడుదలకు ముందు చూసినప్పుడు దానిపై ఎలా స్పందించాలన్న సందిగ్దత నెలకొని వుంటుంది. కానీ ఈ చిత్రం చూడగానే ఓ రకమైన అనుభూతికి లోనయ్యాను. 
 
సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత నా కళ్ల వెంట నీళ్లు ఆగలేదు. నన్ను చూసిన నాగార్జున, మనం చాలా సున్నిత హృదయులుగా వుంటామని అన్నారు. ఈ చిత్రం ఒక మంచి లవ్ స్టోరీ. ఇక అక్కినేని కుటుంబానికి హలోకి అవినాభావ సంబంధం వున్నది. స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు ఒకప్పుడు ''హలో హలో ఓ అమ్మాయి అని అంటే, అక్కినేని నాగార్జున హలో గురూ ప్రేమ కోసమేరా జీవితం అని అన్నాడు. ఇప్పుడు అఖిల్ హలో అంటూ మన ముందుకు వస్తున్నాడు. 
 
ఈ చిత్రం కేవలం యూత్, లవర్స్‌నే కాదు... కుటుంబం మొత్తాన్ని అలరించే చిత్రమవుతుంది. యాక్షన్, ఛేజెస్ చూసి వావ్ అనాల్సిందే. అఖిల్ చిన్నప్పట్నుంచి మా ఇంటికి వస్తుండేవాడు. చరణ్ తో అఖిల్ కలిసి తిరుగుతుంటే... ఇలాంటి అబ్బాయి ఇక్కడే వుంటే ఎంత బాగుండు అని సురేఖ అంటుండేది. నేనప్పుడు అన్నాను. ఇంకేం... నాగార్జున, అమలను అడిగేసి మనం పెంచేసుకుందాం అని. కానీ అఖిల్... వాళ్ల బంగారం... ఎలా వదిలిపెడతారు అంటూ చెప్పారు చిరంజీవి.