ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: గురువారం, 14 డిశెంబరు 2017 (19:51 IST)

రెడ్డి కులాన్ని టార్గెట్ చేసిన రాంగోపాల్ వర్మ... అంతా బయటపెడ్తాడట...

ఎప్పుడూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేసే రాంగోపాల్ వర్మ మరోసారి అలాంటిదే చేశారు. ఈసారి సినిమా హీరోనో, హీరోయినో, లేకుంటే రాజకీయ నాయకుడో కాదు. ఏకంగా కులాన్ని గురించే మాట్లాడారు రాంగోపాల్ వర్మ. రెడ్డి కులాన్ని టార్గెట్ చేశారు. కడప జిల్లా ఈ పేరు వింటేనే రెడ్ల

ఎప్పుడూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేసే రాంగోపాల్ వర్మ మరోసారి అలాంటిదే చేశారు. ఈసారి సినిమా హీరోనో, హీరోయినో, లేకుంటే రాజకీయ నాయకుడో కాదు. ఏకంగా కులాన్ని గురించే మాట్లాడారు రాంగోపాల్ వర్మ. రెడ్డి కులాన్ని టార్గెట్ చేశారు. కడప జిల్లా ఈ పేరు వింటేనే రెడ్లు గుర్తొస్తారు. అందుకే కడప జిల్లా రెడ్ల గురించి అసలు నిజాలను చెబుతానంటున్నారు రాంగోపాల్ వర్మ. 
 
ఇప్పటి వరకు ప్రజలకు కడప రెడ్ల గురించి తెలిసింది కొంతమాత్రమే. అసలు కడప రెడ్ల అసలు బాగోతం ఏమిటి.. అనేది తన వెబ్ సిరీస్‌లో చూడాలంటున్నారు రాంగోపాల్ వర్మ. ఇదే విషయంపై వర్మ ఒక ట్వీట్ కూడా చేశారు. ఇప్పటికే రెడ్ల గురించి అన్నీ తెలుసుకున్నాను. ఖచ్చితంగా మంచి వెబ్ సిరీస్‌ను తీయగలను. కడప రెడ్ల గురించి తీసే సినిమా అందరూ ఖచ్చితంగా చూస్తారన్న నమ్మకం నాకుందన్నారు రాంగోపాల్ వర్మ.