శనివారం, 11 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 అక్టోబరు 2025 (19:01 IST)

మహిళ పీనుగైనా వదలరా.. మార్చురీలో మహిళ మృతదేహంపై లైంగిక దాడి (video)

Woman
Woman
కలియుగంలో అకృత్యాలకు అడ్డు లేకుండా పోతోంది. మహిళలపై వయోబేధం లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. కఠినమైన చట్టాలు వచ్చినా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా పీనుగను కూడా కామపిశాచులు వదిలిపెట్టట్లేదు. మార్చురీలో మహిళ మృతదేహంపై లైంగిక దాడి జరిగిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ బుర్హాన్‌పూర్ జిల్లాలోని ఖక్నార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మార్చురీలో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2024 ఏప్రిల్ 18న స్ట్రెచర్‌పై ఉన్న మహిళ మృతదేహాన్ని పక్కకు లాక్కెళ్లి నీలేష్ భిలాలా అనే కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఏడాదిన్నర తర్వాత సీసీఫుటేజీ ద్వారా ఈ విషయం బయటపడగా, ఆసుపత్రి సిబ్బంది ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 
వైరల్ అయిన సిసిటివి ఫుటేజ్‌లో, పోస్ట్‌మార్టం కోసం షెడ్యూల్ చేయబడిన ఒక మహిళ మృతదేహాన్ని కామాంధుడు ఈడ్చుకెళ్లడం చూడవచ్చు. వీడియోలో చూసినట్లుగా, అతను సిసిటివికి అందకుండా మృతదేహాన్ని పక్కకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొంతకాలం తర్వాత, అతను స్ట్రెచర్ దగ్గర నేలపై ఉన్న శవాన్ని ఈడ్చుకెళ్లి నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపిస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
మరోవైపు, పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భౌరాఘాట్ ప్రాంతంలోని తంగియాపట్ గ్రామానికి చెందిన నీలేష్ భిలాలా (25) నిందితుడిగా గుర్తించారు. అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆపై అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.