సోమవారం, 1 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2025 (15:29 IST)

భార్యాభర్తలు పడక గదిలో ఏకాంతంగా ఉన్నపుడు వీడియో తీసి వివాహితకు పంపారు..

video romance
తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లాలోని ఊరపాక్కానికి చెందిన భార్యాభర్తలు పడక గదిలో ఏకాంతంగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ తర్వాత ఆ  వీడియోను ఆ మహిళకు పంపించి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆమె అసలు విషయాన్ని తన భర్తకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఊరపాక్కానికి చెందిన ఓ వివాహితకు వాట్సాప్‌కు వీడియో వచ్చింది. అందులో తన భర్తతో ఏకాంతంగా గడిపిన దృశ్యాలు ఉండటం చూసి షాక్‌కు గురైంది. పైగా, ఆ వీడియో పంపిన వ్యక్తి తనకు డబ్బులు ఇవ్వాలని లేదంటే వీడియోని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు. 
 
దీంతో భయపడిపోయిన ఆమె జరిగిన విషయాన్ని తన భర్తకు చెప్పి, స్థానిక కిళాంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసుల.. దర్యాపు చేపట్టగా, ఈ పాడు పనికి పాల్పడింది పెరుంబాక్కం కన్నగినగర్‌కు చెందిన ప్రకాష్ (28)గా గుర్తించారు. పరారీలో ఉన్న అతని కోసం గాలింపు చేపట్టగా, అరియలూరు జిల్లా ఉడైయూర్ పాళెంలో ఉన్నట్టు గుర్తించి అరెస్టు చేశారు. భార్యాభర్తలు ఏకాంతంగా ఉండగా ఓ మహిళ వీడియో తీసి తనకు ఇచ్చిందని విచారణలో ఆ వ్యక్తి వెల్లడించారు. అయితే, ఆ వ్యక్తిని కోర్టులో హాజరుపరిచార జైలుకు తరలించి వీడియో తీసిన మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు.