శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 31 జులై 2018 (11:06 IST)

నేనూ బాధితురాలినే... ఎవరికి చెప్పుకోను... క్యాస్టింగ్ కౌచ్‌పై అదితి రావు

బాలీవుడ్ నటిగా గుర్తింపు పొందిన తెలుగు అమ్మాయి అదితి రావు హైదరీ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనంటూ ప్రకటించింది. తన బాధలు ఎవరి చెప్పుకోనూ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప

బాలీవుడ్ నటిగా గుర్తింపు పొందిన తెలుగు అమ్మాయి అదితి రావు హైదరీ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనంటూ ప్రకటించింది. తన బాధలు ఎవరి చెప్పుకోనూ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పైపెచ్చు.. బాలీవుడ్‌లో నిలదొక్కుకోవడానికి చాలా కష్టాలు పడినట్టు ఆమె వెల్లడించింది.
 
తాజాగా ఆమె ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్, తాను ఎదుర్కొన్న అంశాలపై ఏకరవు పెట్టింది. చిత్ర పరిశ్రమలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని, అయితే వాటన్నింటినీ మొండి ధైర్యంతో అధిగమించినట్టు తెలిపింది. చిత్ర పరిశ్రమలో అమ్మాయిలను ఎలా చూస్తారో తెలిసి కొన్నిసార్లు ఏడుపొచ్చిందన్నారు. క్యాస్టింగ్ కౌచ్‌కు నో చెప్పినందుకు కొన్ని నెలలపాటు తనకు అవకాశాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. 
 
ఆ సమయంలో తాను ఏడ్చేశానని, నిస్సహాయత ఆవరించిందని తెలిపింది. దాదాపు 8 నెలలుపాటు ఖాళీగా ఉన్నట్టు చెప్పింది. చేతిలో ఏ సినిమా లేకున్నా తాను తీసుకున్న నిర్ణయం (క్యాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా) తనను మరింత బలంగా తయారు చేసిందని వివరించింది. సినీ పరిశ్రమలో పవర్ ప్లే నడుస్తుంటుందని, దాని వలలో అమ్మాయిలు పడకూడదని హెచ్చరించింది.