శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 జులై 2018 (16:14 IST)

పడక సుఖం అందిస్తేనే సినీ ఛాన్సులా? పూజా కుమార్

పడక సుఖం అందిస్తేనే సినీ అవకాశాలు వస్తాయంటూ పలువురు నటి శ్రీరెడ్డితోపాటు పలువురు హీరోయిన్లు చేస్తున్న వ్యాఖ్యలపై మరో హీరోయిన్ పూజా కుమార్ స్పందించారు. ఈమె గతంలో తెలుగులో హీరో డాక్టర్ రాజశేఖర్ నటించిన

పడక సుఖం అందిస్తేనే సినీ అవకాశాలు వస్తాయంటూ పలువురు నటి శ్రీరెడ్డితోపాటు పలువురు హీరోయిన్లు చేస్తున్న వ్యాఖ్యలపై మరో హీరోయిన్ పూజా కుమార్ స్పందించారు. ఈమె గతంలో తెలుగులో హీరో డాక్టర్ రాజశేఖర్ నటించిన "గరుడవేగ", ఆ తర్వాత విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం "విశ్వరూపం-2" చిత్రాల్లో నటించింది.
 
ఈ నేపథ్యంలో ఆమె క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందిస్తూ, తానెప్పుడూ కాస్టింగ్ కౌచ్‌ సమస్యను ఎదుర్కోలేదని చెప్పింది. పైగా, పడక సుఖం అందిస్తేనే సినీ అవకాశాలు వస్తాయా? అని ఆమె ఎదురు ప్రశ్నించింది. టాలెంట్ ఉంటే అవ‌కాశాలు వాటంతటవే వ‌స్తాయ‌ని, త‌ప్పుడు ప‌నులు చేసి అవ‌కాశాలు వ‌చ్చేలా చేసుకోవ‌డం అవ‌స‌ర‌మా? అని ఆమె ప్రశ్నించింది. 
 
కాగా, ఇటీవల తెలుగు నటి శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన ఆరోపణలు చేయడమేకాకుండా, ఈ ఊబిలో పలువురు హీరోయిన్లు సైతం ఉన్నట్టు ప్రకటించారు. క్యాస్టింగ్ కౌచ్‌లో పలువురు హీరోలకు సంబంధం ఉన్నట్టు సంచలన ఆరోపణలు చేశారు.