శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 28 నవంబరు 2017 (14:00 IST)

విశ్వరూపం-2 చివరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం... డిసెంబరులో ట్రైలర్

సినీ లెజెండ్ కమల్ హాసన్ తమిళం స్పై థ్రిల్లర్ విశ్వరూపం-2 సినిమా ఫైనల్ షెడ్యూల్ ప్రారంభమైంది. వారం రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని.. ఆపై టాకీ పార్ట్‌ను పూర్తి చేసే పనుల్లో సినీ యూనిట్ భాగమవుతుం

సినీ లెజెండ్ కమల్ హాసన్ తమిళం స్పై థ్రిల్లర్ విశ్వరూపం-2 సినిమా ఫైనల్ షెడ్యూల్ ప్రారంభమైంది. వారం రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని.. ఆపై టాకీ పార్ట్‌ను పూర్తి చేసే పనుల్లో సినీ యూనిట్ భాగమవుతుంది. టాకీ పార్ట్‌తో విశ్వరూపం 2 సినిమా షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది.   విశ్వరూపం తొలి భాగం వివాదాలకు తావిచ్చిన నేపథ్యంలో చాలా గ్యాప్ తర్వాత విశ్వరూపం 2 ప్రారంభమైంది. 
 
ఈ సినిమా ట్రైలర్ నవంబర్ 2న కమల్ హాసన్ పుట్టిన రోజున విడుదల కావాల్సింది. అయితే అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాలేదు. దీంతో డిసెంబరులో ట్రైలర్, వచ్చే ఏడాది ఆడియోను రిలీజ్ చేసేందుకు అవకాశం వున్నట్లు సమాచారం.
 
విశ్వరూపం-2 చాలా ఎమోషన్ సన్నివేశాలుంటాయని.. ఆండ్రియా, పూజా కుమార్, శేఖర్ కపూర్ ఈ చిత్రంలో నటిస్తారు. ఇక యాక్షన్-కామెడీ శభాష్ నాయుడు సినిమాలో కమల్ హాసన్ బిజీగా వున్నాడు. గత ఏడాది గాయం కారణంగా కమల్ ఇబ్బంది పడ్డాడు. దీంతో విశ్వరూపం-2, శభాష్ నాయుడు షూటింగ్‌లకు బ్రేక్ పడింది.