మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 17 నవంబరు 2017 (08:39 IST)

పార్టీ పెట్టాకే వసూళ్లు... కమల్ హాసన్

సినీ నటుడు కమల్ హాసన్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. ఇందుకోసం ఆయన కింది స్థాయి నుంచి పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ స్థాయి నుంచి పునాదులు పటిష్టంగా వేసుకుని ఆ తర్వాత

సినీ నటుడు కమల్ హాసన్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. ఇందుకోసం ఆయన కింది స్థాయి నుంచి పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ స్థాయి నుంచి పునాదులు పటిష్టంగా వేసుకుని ఆ తర్వాత పార్టీ పెట్టాలన్న ఆలోచనతో ఆయన ముందుకెళుతున్నారు. 
 
అయితే, రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్టు కమల్ హాసన్ ప్రకటించిన వెంటనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు చందాలు కుప్పలుతెప్పలుగా పంపిస్తున్నారు. ఫలితంగా ఇప్పటికే రూ.30 కోట్లకు చేరుకున్నాయి. అయితే ఈ సొమ్ము మొత్తాన్ని ఆయా వ్యక్తులు, సంస్థలకు తిరిగి ఇచ్చేస్తానని కమల్ హాసన్ ప్రకటించారు. పార్టీ పేరు పెట్టలేదు.. ఆఫీస్ ప్రారంభించలేదు.. అప్పుడే విరాళాలు తీసుకోవటం తొందరపాటు నిర్ణయం అవుతుందన్నారు. ఆ డబ్బును తన దగ్గర ఉంచుకోవటం కూడా చట్టరీత్యా నేరమని ప్రకటించి ఆయన తన నిజాయితీని చాటుకున్నారు. 
 
అలా అని కమల్ హాసన్ పార్టీ పెట్టరా? అనే సందేహం వద్దు. కచ్చితంగా పార్టీ పెట్టి తీరతా. పేరు పెట్టిన తర్వాత.. పార్టీకి స్వరూపం వచ్చిన తర్వాత విరాళాలు కూడా తీసుకుంటాను అని కుండబద్దలు కొట్టారు. ఓ పార్టీ నడపాలి అంటూ ప్రజల భాగస్వామ్యం అవసరం అని.. అప్పుడే ఫండ్ తీసుకుంటానని వెల్లడించారు. తీసుకునే ప్రతి రూపాయికి లెక్క ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.