బుధవారం, 27 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 12 నవంబరు 2017 (14:24 IST)

హీరోలు రాజకీయాల్లోకి రావడం దేశానికి విపత్తు: ప్రకాశ్ రాజ్

తమిళ అగ్రహీరోలు కమల్ హాసన్, రజనీకాంత్‌లు రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ పరిస్థితుల్లో మరో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తమిళ అగ్రహీరోలు కమల్ హాసన్, రజనీకాంత్‌లు రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ పరిస్థితుల్లో మరో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం నా దేశానికి ఓ విపత్తులాంటిదే అని అతను అన్నాడు. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని ఈ సందర్భంగా స్పష్టంచేశాడు. 
 
ఇదే అంశంపై ఆయన బెంగుళూరులో మాట్లాడుతూ, నటులు రాజకీయాల్లోకి రావడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్లకు అభిమానులు ఉంటారు. వాళ్ల పట్ల తమకున్న బాధ్యతపై నటులకు ఎప్పుడూ అవగాహన ఉండాలి అని అతను అన్నాడు. 
 
ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడే ప్రకాశ్‌రాజ్ మరో ఆసక్తికర వ్యాఖ్య కూడా చేశాడు. సినిమా హాల్లో నిలబడి తమ దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదని అతను స్పష్టంచేశాడు. గతంలోనూ గౌరీ లంకేష్ హత్యపై స్పందిస్తూ.. మోడీ కన్నా మంచి నటుడని, ఆయనకు తన అవార్డులు ఇచ్చేస్తానని ప్రకాశ్ అన్న విషయం తెలిసిందే.