1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Visa applications for Turkiye Azerbaijan drop by 42 pc Atlys

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

visa
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు బహిరంగ మద్దతు పలికిన టర్కీ, అజర్‌బైజాన్‌లకు గట్టి దెబ్బ తగిలింది. ఆ దేశాలు పాకిస్థాన్‌కు మద్దతు ప్రకటించడంపై మన దేశంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆయా దేశాలకు వెళ్లేందుకు భారత పర్యాటకులు అనాసక్తి చూపుతున్నారు. దీనికి కారణం ఆ రెండు దేశాల వీసా దరఖాస్తుల్లో గత కొన్ని రోజులుగా 42 శాతం క్షీణత కనిపించడమే. ఈ విషయాన్ని వీసా ప్రాసెసింగ్ సంస్థ అట్లీస్ వెల్లడించింది. వీసా ప్రక్రియ మధ్యలో ఉన్నప్పటికీ అనేక మంది ఉపసంహరించుకుంటున్నట్టు వెల్లడించింది. 
 
టర్కీ, అజర్‌బైజాన్‌‍కు ఈ సారి భారీ స్థాయిలో పర్యాటకులు తాడికి ఉంది. అట్లీస్ ప్రకారం జనవరి - మార్చి కాలంలో గత యేడాది కన్నా దరఖాస్తులు సంఖ్య 64 శాతం పెరిగినట్టు అంచనా. అయితే, ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు దీనిపై తీవ్ర ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగర ప్రజల నుంచి టర్కీ, అజర్ బైజాన్‌లకు వెళ్లే పర్యాటకులు, ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
 
ఈ ప్రాంతాల నుంచి వచ్చే దరఖాస్తుల్లో 53 శాతం తగ్గగా, ఇండోర్, జైపూర్ వంటి ద్వితీయశ్రేణి నగరాల నుంచి ఈ సంఖ్య మరింతగా తగ్గిందని అట్లీస్ వెల్లడించింది. ఫ్యామిలీ ట్రిప్స్ సహా గ్రూపు వీసా దరఖాస్తుల్లో 49 శాతం క్షీణత కనిపించగా, ఒంటరిగా వెళ్లే వారిలో 27 శాతం తగ్గిందని తెలిపింది. 
తర్వాతి కథనం
పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?