1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 మే 2025 (17:19 IST)

ఐఎన్ఎస్ విక్రాంత్‌పై దాడి చేశాం... భారత్‌ను భయపెట్టాం : పాక్ ప్రధాని గొప్పలు

Shehbaz Sharif
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్‌ చేపట్టింది. ఇందులో పాకిస్థాన్‌పై భారత్ సైనికులు భీకర దాడులు చేశారు. దీంతో పాకిస్థాన్ బెంబేలెత్తిపోయి కాళ్లబేరానికి వచ్చింది. అయితే, పాకిస్థాన్ మాత్రం తన వంకర బుద్ధిని మార్చుకోలేదు. అబద్దాలు చెపుతూ దేశ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. 
 
తాజాగా ఆ దేశ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ మరోమారు దేశ ప్రజలను తప్పుదారి పట్టించేలా అసత్య ప్రచారం చేశారు. భారత్‌పై విజయం సాధించామంటూ సంబరాలు జరుపుకోగా, ఇపుడు భారత్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌పై దాడి చేసినట్టు వెల్లడించారు దీంతో భారత్ తోకముడిచి వెనక్కి తగ్గిందంటూ వ్యాఖ్యానించారు. పైగా, పాక్ వైమానికదళం జరిపిన దాడిలో ఐఎన్ఎస్ విక్రాంత్ ధ్వంసమైందన్నారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదంతో పాటు వైరల్ అయ్యాయి. 
 
కరాచీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న షెహ్‌బాజ్‌ షరీఫ్.. పాక్ నావికాదళం, వైమానికదళాలను ప్రశంసిస్తూ గొప్పలు చెప్పుకున్నారు. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్థాన్ సరిహద్దులకు సమీపంగా కేవలం 400 నాటికన్ మైళ్ల దూరంలోకి వచ్చిదంని, అయితే, మన వైమానికధళం విక్రాంత్‌పై దాడి చేసి తీవ్ర నష్టం చేకూర్చిందని అన్నారు. మన దెబ్బకు ఐఎన్ఎస్ విక్రాంత్ తోకముడిచి పారిపోయిందని షెహ్‌బాజ్ షరీఫ్ పచ్చి అబద్ధాలు చెప్పారు.