1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 మే 2025 (00:14 IST)

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

pakistan flag
భారత్‌తో ఎదుకు ఘర్షణ పడతారని, అలా చేయడం వల్ల అపారంగా నష్టపోయేది మీరేనంటూ పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తలంటింది. పైగా, పాకిస్థాన్ వినతి మేరకు ఒక బిలియన్ డాలర్ల నిధులను ఇచ్చేందుకు సమ్మతించిన ఐఎంఎఫ్.. నిధుల విడుదలకు ముందు అనేక షరతులు విధించింది. 
 
అంతేకాకుండా, భారత్‌తో ఉద్రిక్తలు ఇంకా పెంచుకోవడం వల్ల మీకే (పాక్) ఎక్కువ సమస్యలు, నష్టమని తేల్చి చెప్పింది. ఈ ఘర్షణల వల్ల దేశంలో ఆర్థిత, బాహ్య సంస్కరణల లక్ష్యాలకు ముప్పు కలిగిస్తాయని హెచ్చరించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల వల్ల స్టాక్ మార్కెట్ మొదట నష్టాల్లోకి వెళ్ళినప్పటికీ ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయని ఐఎంఎఫ్ నివేదికలు పేర్కొన్నాయి. 
 
ఐఎంఎఫ్ ఇస్తున్న నిధులను పాక్‍‌ అభివృద్ధికి కాకుండా ఉగ్రవాదలను పెంచి పోషించడానికి వినియోగిస్తోందంటూ భారత్ ఇటీవల ఆరోపించింది. ఆపరేషన్‌ సిందూర్‌లో ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాలను పునర్నిర్మంచడానికి జైషే మొహ్మద్ చీఫ్ అసూద్ ఆజాద్‌కు పాకిస్థాన్ రూ.14 కోట్లు ఇస్తున్నట్టు పాక్ ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొంది. ఇలాంటి విషయాలన్ని ఐఎంఎఫ్ ముందు భారత్ ప్రస్తావించినప్పటికీ పాకిస్థాన్‌కు మాత్రం ఐఎంఎఫ్ నిధులు మంజూరు చేసింది.