1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 మే 2025 (23:38 IST)

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

India vs Pakistan
'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారత్ వైమానిక దళం (ఐఏఎఫ్) నిర్వహించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు వెల్లడంచింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా, పాకిస్థాన్‌లోని కీలక సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసే క్రమంలో ఆ దేశం చైనా నుంచి సమకూర్చుకున్న అత్యాధునిక రక్షణ వ్యవస్థలను భారత్ వాయుసేన విజయవంతంగా ఏమార్చిందని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ చర్య, మారుతున్న యుద్ధ తంత్రాలకు భారత్ ఇస్తున్న ఖచ్చితమైన వ్యూహాత్మక ప్రతిస్పందన అని చెప్పారు. 
 
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత యుద్ధ విమానాలు, ఇతర స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన ఆయుధ వ్యవస్థలు పాకిస్థాన్‌లోని నూర్ ఖాన్, రహీమ్‌యార్ ఖాన్ వైమానిక స్థావరాలే లక్ష్యంగా దాడులు నిర్వహించాయని ప్రభుత్వం తెలిపింది. పాక్‌కు చైనా సరఫరా చేసిన గగనతల రక్షణ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి, కేవలం 23 నిమిషాల్లోనే ఈ ఆపరేషన్‌ను పూర్తి చేయడం భారత సాంకేతిక ఆధిక్యతకు నిదర్శనమని పేర్కొంది. ఈ దాడుల సమయంలో నియంత్రణ రేఖ (ఎల్వోసీ)గానీ, అంతర్జాతీయ సరిహద్దునుగానీ భారత వాయుసేన దాటలేదని, ఎలాంటి భారత ఆస్తులకు నష్టం వాటిల్లలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 
 
మారుతున్న అసమాన యుద్ధ రీతులకు ప్రతిస్పందనగా, ఆపరేషన్ సిందూర్ ఒక అద్భుతమైన సైనిక చర్యగా రూపుదిద్దుకుంది. భారతదేశం యొక్క ప్రతిస్పందన ఉద్దేశపూర్వకమైనది, ఖచ్చితమైనది మరియు పూహాత్మకమైనది అని ప్రభుత్వం ప్రభుత్వ ప్రకటన వివరించింది. ఈ ఆపరేషన్ భారత సైనిక చర్యల ఖచ్చితత్వంతో పాటు దేశ సాంకేతిక స్వాలంబనకు ఒక మైలురాయిగా నిలిచిందని తెలిపింది.