అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రొస్టేట్ కేన్సర్, ఎముకలకు పాకింది
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు (Joe Biden) అత్యంత వేగంగా వ్యాపించే రకపు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని, అది అతని ఎముకలకు వ్యాపించిందని డెమొక్రాట్ కార్యాలయం ఆదివారం ప్రకటించింది. మూత్ర విసర్జన సమయంలో ఆయన తీవ్ర సమస్యను అనుభవించిన తర్వాత డెమొక్రాటిక్ నాయకుడికి ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ప్రోస్టేట్ నోడ్యూల్ కనుగొనబడిందని పత్రికా ప్రకటన తెలిపింది. దీనితో ఆయనకు ఆ వ్యాధిని ఏవిధంగా చికిత్స చేసి తగ్గించాలన్న దానిపై వైద్యులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
82 ఏళ్ల నాయకుడి కుమారుడు బ్యూ బైడెన్ కూడా 2015లో క్యాన్సర్‌తో మరణించాడు. ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది పురుషులలో అత్యంత సాధారణమైన క్యాన్సర్. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నివేదించిన ప్రకారం, అమెరికాలో ప్రతి ఎనిమిది మంది పురుషులలో ఒకరు వారి జీవితకాలంలో దీనితో బాధపడుతున్నారు. ముందుగానే గుర్తిస్తే చికిత్స చేయవచ్చు, అయితే ఆలస్యమైతే ప్రాణంతకంగా మారుతుంది. ఇది పురుషులలో క్యాన్సర్ మరణానికి రెండవ ప్రధాన కారణం అని సంస్థ తెలిపింది.