ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 16 నవంబరు 2017 (13:22 IST)

లక్ష్మీస్ వీరగ్రంథం : లక్ష్మీపార్వతి పాత్రకు హీరోయిన్ ఫిక్స్

తెలుగు చిత్రపరిశ్రమలోని చిన్న దర్శకనిర్మాతల్లో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఒకరు. ఈయన తాజాగా ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా "లక్ష్మీస్ వీరగ్రంథం" (ఆదర్శగృహిణి) అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్

తెలుగు చిత్రపరిశ్రమలోని చిన్న దర్శకనిర్మాతల్లో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఒకరు. ఈయన తాజాగా ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా "లక్ష్మీస్ వీరగ్రంథం" (ఆదర్శగృహిణి) అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ను కూడా ఈనెల 12వ తేదీన ప్రారంభించారు. 
 
ఆ తర్వాత షూటింగ్ నిమిత్తం ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరుకి చిత్ర బృందం వెళ్లింది. అక్కడి ప్రజల నుంచి నిరసన వ్యక్తంకావడంతో మూవీ టీం వెనుదిరిగి వచ్చింది. అయితే ఈ 'లక్ష్మీస్ వీరగ్రంథం'లో లక్ష్మీ పార్వతి పాత్రని రాయ్ లక్ష్మీ చేయనుందని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం 'గరుడవేగ' ఫేం పూజా కుమార్ లక్ష్మీస్ వీరగ్రంథంలో ప్రధాన పాత్ర కోసం ఎంపిక చేసినట్టు సమాచారం. 
 
ఈ విషయాన్ని దర్శకుడు తన సోషల్ మీడియా పేజ్ ద్వారా తెలిపాడు. వీరగంధం సుబ్బారావు సతీమణిగా ఉన్న లక్ష్మీ పార్వతి దివంగత సీఎం ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా ప్రవేశించిందన్న ఆసక్తికర విషయాలను ఈ సినిమాలో చూపించనున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను మహేష్ మంజ్రేకర్ పోషించనున్న సంగతి తెలిసిందే. పూజా కుమార్ రీసెంట్‌గా డాక్టర్ రాజశేఖర్ హీరోగా వచ్చిన ‘గరుడవేగ’లో నటించగా, ఈ అమ్మడి నటనకి మంచి మార్కులు పడిన విషయం తెల్సిందే.