మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 31 జులై 2018 (09:24 IST)

ఇక బ్యాచిలర్‌గానే ఉంటానంటున్న బాలీవుడ్ హీరో... ఎవరు?

బాలీవుడ్ హీరోల్లో హృతిక్ రోషన్ ఒకరు. ఈయన సుసాన్నే ఖాన్‌ను 2000 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయారు. మొదటి భార్యతో తెగదెంపులు చేసుకున్న హృతిక్.. ఆ తర్వాత రెండో పెళ్లి

బాలీవుడ్ హీరోల్లో హృతిక్ రోషన్ ఒకరు. ఈయన సుసాన్నే ఖాన్‌ను 2000 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయారు. మొదటి భార్యతో తెగదెంపులు చేసుకున్న హృతిక్.. ఆ తర్వాత రెండో పెళ్లి గురించి ఆలోచన చేయలేదు. కానీ, మాజీ భార్యతో హృతిక్ రోషన్ సంబంధాలు సఖ్యతగానే ఉన్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం.
 
అప్పుడప్పుడు బయటికెళ్ళడం, తరచూ ప్రైవేట్ పార్టీల్లో కలిసి కనిపించడం వలన అందరూ వీరి నడుమ మనస్పర్థలు తోలగిపోయాయని, మరోసారి వివాహం చేసుకుని ఒకటవరవుతారని అనుకున్నారు. కానీ ఆయన దగ్గరి వ్యక్తులు మాత్రం ఇద్దరూ తరచూ మాట్లాడుకోవడం, అభిప్రాయాలను పంచుకోవడం చేస్తున్నారని, కానీ ఇప్పుడే మళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచనలో అయితే లేరని, ఒకవేళ అవసరమైతే పిల్లల కోసం భవిష్యత్తులో కలిసే చాన్సులున్నాయని అంటున్నారు. అంతేకానీ, రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం మాత్రం హృతిక్‌కు లేదని వారు ఘంటాపథంగా చెపుతున్నారు.