శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: సోమవారం, 30 ఏప్రియల్ 2018 (19:25 IST)

'నా పేరు సూర్య'పై కుట్ర... ఇది నిజ‌మా..?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాదులో గ్రాండ్‌గా జ‌రిగింది. ఈ వేడుక‌లో మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ మా

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాదులో గ్రాండ్‌గా జ‌రిగింది. ఈ వేడుక‌లో మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ మాట్లాడుతూ... నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాపై కుట్ర జ‌రుగుతోంది అంటూ సంచ‌ల‌న వ్యాఖ్యాలు చేసారు. 
 
ఇటీవ‌ల ఇండ‌స్ట్రీలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల నేప‌ధ్యంలో ఈ సినిమాపై కుట్ర జ‌రుగుతోంద‌ని స్వ‌యంగా అల్లు అర‌వింద్ చెప్ప‌డం హాట్ టాపిక్ అయ్యింది. సినిమా బాగుంటే అందరూ చూస్తారు. ఒక నిజాయతీ కలిగిన చిత్రం చేయాలని బన్ని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాడు. ఈ కథ విని, మా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు వంశీ ఇలా తీస్తారని అస్సలు అనుకోలేదు. బ‌న్నీ న‌మ్మ‌కానికి త‌గ్గట్టు వంశీ ఈ సినిమాని అద్బుతంగా తెర‌కెక్కించాడు.  
 
దాసరి నారాయణరావుగారి పుట్టినరోజు నాడు సినిమా విడుదలవడం సంతోషం. మిగిలింది స‌క్స‌స్ మీట్‌లో మాట్లాడ‌తా అన్నారు. మ‌రి... అల్లు అర‌వింద్ చెప్పిన‌ట్టుగా నిజంగానే నా పేరు సూర్యపై కుట్ర జ‌రుగుతోందా..? లేక సినిమాకి ప్ల‌స్ అవుతుంద‌నే ఉద్దేశంతో ఇలా అల్లు అర‌వింద్ ఇలా మాట్లాడారా..? ఇప్పుడు సినీ ప్రియులు అంద‌రిలో ఇదే ప్ర‌శ్న‌. నిజం ఆయ‌న‌కే తెలియాలి.