శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (11:55 IST)

దొరలంటే ఇప్పుడు మీడియా ఆసాములే.. నా తల్లిని తిట్టించడంలో ఆ ముగ్గురు?: పవన్

మీడియా ఛానల్స్ యాజమాన్యంపై జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తన మీద, తన తల్లి మీద మీరు చేస్తున్న ఈ స్పెషల్ ట్రీట్‌మెంట్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్, ప

మీడియా ఛానల్స్ యాజమాన్యంపై జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తన మీద, తన తల్లి మీద మీరు చేస్తున్న ఈ స్పెషల్ ట్రీట్‌మెంట్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్, ప్రతిపక్ష నేత, బాలకృష్ణ గారిపై చేయగలరా అంటూ పవన్ ప్రశ్నించారు. 
 
కానీ ఒక్క పవన్ కల్యాణ్, అతని తల్లి మీద మాత్రం బాగా చేస్తున్నారంటూ విమర్శలు కురిపించారు. ఒకప్పుడు దొరలంటే భూస్వామ్యులు కానీ ప్రస్తుతం దొరలంటే ఈ మీడియా ఆసాములని.. వారు చెప్పిందే వేదం.. వారు పాడిందే నాదం అంటూ మీడియా ఛానల్స్‌ యాజమాన్యంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
మరోవైపు జనసేన అధినేత పవన్ తన అన్న నాగబాబుతో కలిసి ఫిలింఛాంబర్ చేరుకున్నారు. న్యాయవాదులతో వీరిద్దరూ సమావేశమయ్యారు. తన తల్లిని బహిరంగంగా దూషించిన ఘటనపై ఆయన న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ సమావేశానికి అల్లు అర్జున్ కూడా వచ్చాడు. 
 
తన తల్లిని తిట్టించడంలో టీడీపీ బాసులకు టీవీ9 రవిప్రకాశ్, రామ్ గోపాల్ వర్మ, శ్రీసిటీ యజమాని శ్రీని రాజులు సహకరించారంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.