శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (12:45 IST)

ఏకమైన మెగా ఫ్యామిలీ... 'చెప్పను బ్రదర్' అంటూనే ఆలింగనం

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తల్లిని నటి శ్రీరెడ్డి దూషించడం, దీనివెనుక వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ హస్తం ఉంది. వీటన్నింటి వెనుక కొన్ని రాజకీయశక్తులు ఉన్నట్టు హీరో పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. ఇదే

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తల్లిని నటి శ్రీరెడ్డి దూషించడం, దీనివెనుక వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ హస్తం ఉంది. వీటన్నింటి వెనుక కొన్ని రాజకీయశక్తులు ఉన్నట్టు హీరో పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై ఆయన శుక్రవారం ఓ ట్వీట్ చేశారు.
 
శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలతో కలత చెందిన పవన్ కళ్యాణ్ శుక్రవారం ఫిల్మ్ చాంబర్‌కు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మిగిలిన మెగా ఫ్యామిలీ హీరోలు అక్కడకు చేరుకున్నారు. వీరిలో అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఉన్నారు. 
 
అయితే, పవన్ కళ్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని మాటల్లో చెప్పను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ గతంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్‌లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏ సందర్భంలో కూడా పవన్ కల్యాణ్, అల్లు అర్జున్‌లు కలవలేదు. ఏ ఫంక్షన్‌లోనూ ఇద్దరూ కలసి కనిపించలేదు. 
 
అలాంటి వీరిద్దరూ ఇపుడు కలుసుకున్నారు. పవన్ కల్యాణ్, తన చిన్నన్న నాగబాబుతో కలిసి ఫిలిం ఛాంబర్‌కు చేరుకున్న సమయంలోనే హీరో అల్లు అర్జున్ కూడా అక్కడకు వచ్చాడు. ఈ సందర్భంగా బన్నీని పవన్ కల్యాణ్ ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.