శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (11:53 IST)

సంచలన నిర్ణయం దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సంచల నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులోభాగంగా శుక్రవారం ఉదయం ఫిలించాంబర్‌లో న్యాయవాదులతో పవన్ సమావేశమయ్యారు. పవన్ వెంట నాగబాబు కూడా ఉన్నారు.

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సంచల నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులోభాగంగా శుక్రవారం ఉదయం ఫిలించాంబర్‌లో న్యాయవాదులతో పవన్ సమావేశమయ్యారు. పవన్ వెంట నాగబాబు కూడా ఉన్నారు.
 
ఫిల్మ్ చాంబర్‌కు పవన్‌ చేరుకున్నారనే విషయం బయటకు రావడంతో ఫిల్మ్ చాంబర్‌కు ఆయన అభిమానులతో పాటు.. జనసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. అలాగే పవన్‌ను చూసేందుకు అనేక మంది అక్కడికి తరలివచ్చారు. దీంతో ఫిల్మ్ చాంబర్ వద్ద హడావుడి నెలకొంది. అలాగే, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు కూడా అక్కడకు చేరుకున్నారు. 
 
కాగా, తన తల్లిని దూషించిన వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలన్నదే పవన్ అభిమతంగా కనిపిస్తోంది. ఫిలించాంబర్‌లో పవన్ మౌన పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్‌ తల్లిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై, ఆ వ్యాఖ్యలు తానే చేయించానని చెప్పిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న సంగతి తెలిసిందే.