మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 15 నవంబరు 2018 (17:04 IST)

గేట్ ఉమెన్ దుస్తులు మార్చుకుంటుంటే తొంగిచూసిన స్టేషన్ మాస్టర్...

తన కింద పని చేసే మహిళ ఉద్యోగినిని కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ రైల్వే స్టేషన్ మాస్టర్... వక్ర దృష్టితో చూశాడు. ఆ మహిళ పక్క గదిలో దుస్తులు మార్చుకుంటుంటే తలుపు రంధ్రాల్లో నుంచి తొంగి చూడటమేకాకుండా, వీడియో కూడా తీశాడు. వెస్ట్ గోదావరి జిల్లా రామచంద్రపురం రల్వే స్టేషన్‌లో జరిగిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఇక్కడ మహ్మద్ రియాద్ స్టేషన్ మాస్టర్‌గా పని చేస్తున్నారు. ఇదే స్టేషన్‌లో ఓ మహిళ గేట్ ఉమెన్‌గా పని చేస్తోంది. ఈమె విధులు నిర్వహించేందుకు స్టేషన్‌కు వచ్చినపుడు స్టేషన్ మాస్టర్ ఉండే గదికి పక్కనే ఉండే మరో గదిలో తన యూనిఫాం దుస్తులు మార్చుకునేది. 
 
ఈ విషయాన్ని గమనించిన రియాద్... ఆమె దుస్తులు మార్చుకోవడం తలుపు రంధ్రాల నుంచి తొంగిచూడటమేకాకుండా, పవర్ బాక్స్‌లో కెమెరాను అమర్చాడు. అలా కొన్ని రోజులుగా తీసిన విడియోలను తన ల్యాప్‌టాప్‌లో భద్రపరుచుకుంటూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో ఓ రోజున తలుపు వద్ద అలికిడి శబ్దం వినిపించడంతో ఓ కన్నేసిన గేట్ ఉమెన్.. స్టేషన్ మాస్టర్ వక్రబుద్ధిని కనిపెట్టింది. పైగా, పవర్ బాక్స్ తెరిచి చూడగా అందులో చిన్నపాటి కెమెరాను గుర్తించింది. ఈ విషయాన్ని ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడమేకాకుండా రాజమండ్రి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన రాజమండ్రి డీఆర్ఎం ఆదేశంతో రంగంలోకి దిగిన పోలీసులు.. స్టేషన్ మాస్టర్ కెమెరా, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అదేసమయంలో ఈ పాడుపనికి పాల్పడిన స్టేషన్‌ మాస్టర్‌ను కూడా డీఆర్ఎం సస్పెండ్ చేశారు.