మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Modified: మంగళవారం, 13 నవంబరు 2018 (12:57 IST)

గుడ్లగూబ బలితో యువతి వశీకరణ యత్నం... ఏమైంది..?

సాహసం సేయరా ఢింబకా... రాజకుమారి లభిస్తుందిరా.... అనే మాటను మనం ఎన్టీఆర్ పాత సినిమా పాతాళ భైరవిలో చూడొచ్చు. బలి ఇవ్వడం ద్వారా దేవి అనుగ్రహం పొందాలనుకుంటాడు మాంత్రికుడు. అచ్చం అలాంటి మూఢ విశ్వాసం ఢిల్లీలో ఓ 40 ఏళ్ల వ్యక్తి నమ్మాడు. ఐతే అతడు ఓ యువతిని వశీకరణ చేసుకునేందుకు బలి ఇచ్చేందుకు పక్షిని ఎంచుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళ్తే... సుల్తాన్‌పురికి చెందిన 40 ఏళ్ల కన్హయ్య ట్రక్ డ్రైవరు. ఇతడికి భార్యాపిల్లలు వున్నా మరో అమ్మాయిపై కన్నేశాడు. ఆమె ఎలాగైనా తన ప్రేమలో పడేవిధంగా చూడాలని తాంత్రిక విద్య నేర్చుకుని గుడ్లగూబను బలి ఇస్తే తను అనుకున్నది నెరవేరుతుందని అనుకున్నాడు. దీనితో గుడ్లగూబను పట్టుకొచ్చి కత్తితో దాని కాళ్లను నరికేశాడు. 
 
ఆ తర్వాత దానిలో ఒక్కో భాగంపై గుచ్చుతూ వాటిని వేరు చేస్తూ దాని ప్రాణాలు తీశాడు. అలా చేసి యువతి తనవైపు ఆకర్షించబడుతుందేమో చూడసాగాడు. చివరికి యువతి ఆకర్షితురాలవడం అటుంచి విషయం జంతు సంరక్షణ శాఖకు తెలియడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.