ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (12:41 IST)

రాముడు - కృష్ణుడు ధూమపానం చేశారా? రాందేవ్ బాబా ఏమంటున్నారు?

యువతలో పెరిగిపోతున్న ధూమపానం అలవాటుపై ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాముడు, కృష్ణుడు వంటి వారు ధూమపానం చేశారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళలో ఆయన పాల్గొన్నారు. 
 
ఈ కుంభమేళాకు వచ్చిన సాధువులను ఆయన కలిశారు. ఆ సమయంలో సాధువులు ధూమపానం చేస్తుండటాన్ని రాందేవ్ గుర్తించారు. అపుడు వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, సాధువులెవ‌రూ ధూమ‌పానం చేయరాదంటూ కోరారు. 
 
రాముడు, కృష్ణుడి బాట‌ను మ‌నం అనుస‌రిస్తున్నామ‌ని, వాళ్లెవ్వ‌రూ ధూమ‌పానం చేయ‌లేద‌ని, మ‌నం కూడా ధూమ‌పానం చేయ‌కూడద‌ని వాగ్ధానం చేయాల‌ని అన్నారు. ఓ మంచి కార‌ణం కోసం మ‌నం మ‌న ఇంటిని, త‌ల్లితండ్రుల‌ను వ‌దిలి వచ్చామ‌ని, అలాంట‌ప్పుడు స్మోకింగ్‌ను ఎందుకు వ‌దిలేయ‌లేమ‌న్నారు. 
 
ఈ సందర్భంగా పలువురు సాధువుల వద్ద ఉన్న ధూమపాన పైపులను తీసుకున్న బాబా రాందేవ్.. వాటిని తాను నిర్మించబోయే ఆలయంలో ఉంచనున్నట్టు వారికి తెలిపారు. ఎంతో యువతను ధూమపానం నుంచి విముక్తులను చేశానని, అలాగే, సాధువులతో కూడా పొగతాగకుండా చేస్తానని చెప్పారు.