శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 30 జనవరి 2019 (13:38 IST)

విజయసాయి బంధువు తెదేపా వైపు... వర్ల రామయ్య సోదరుడు వైకాపాపై మనసు

అసెంబ్లీతోపాటు లోక్‌సభ ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో రాజకీయ వలసలు ఊపందుకున్నాయి. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను టార్గెట్ చేస్తుంటే, విపక్ష పార్టీ కూడా ఏమాత్రం తీసిపోవడం లేదు. 
 
ఇటీవల టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సోదరుడు వైకాపా తీర్థం పుచ్చుకున్నాడు. ఇపుడు ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత వర్ల రాయమ్య సోదరుడు వర్ల రత్నం వైకాపాలో చేరేందుకు సిద్ధమయ్యాడు. ఇదే విషయంపై ఆయన బుధవారం వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డితో సమావేశంకానున్నారు. దీన్ని టీడీపీ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. 
 
ఇదిలావుంటే, వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి బామ్మర్ది వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈయన ఇప్పటికే టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రహస్యంగా సమావేశమయ్యారు. కాగా, బీజేపీ నేత దగ్గుబాటి వెంకటేశ్వర రావు కూడా వైకాపాలో చేరనున్న విషయం తెల్సిందే.