గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Updated : ఆదివారం, 27 జనవరి 2019 (10:46 IST)

నాగబాబు యూట్యూబ్ ఛానల్.. వరుస భేటీలతో పవన్ కోసం...?

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అన్నీ స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ చీఫ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో... పవన్ కోసం మెగా బ్రదర్ నాగబాబు రంగంలోకి దిగారు. పవన్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించేందుకు నాగబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలతో నాగబాబు వరుసగా భేటీ అవుతున్నారు. 
 
వచ్చే ఎన్నికల కోసం దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా గత మూడు రోజుల పాటు తూర్పు గోదావరి జిల్లాలో నాగబాబు పర్యటిస్తూ.. పార్టీ బలోపేతం కోసం చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పటికే పని మొదలెట్టారు. 
 
ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, వైకాపా చీఫ్ జగన్, హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి హీరో బాలయ్యపై నాగబాబు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీ అధినేత జగన్‌పై మరో వీడియోను విడుదల చేశారు. ఇప్పుడు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు.