సంబంధిత వార్తలు
- 'ఎన్టీఆర్ కథానాయకుడు' ట్విట్టర్ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే...
- బాలయ్య వర్సెస్ నాగబాబు : 'ఎర్రోడి వీరగాథ' పేరుతో వీడియో
- తిరుపతిలో కంట తడిపెట్టిన బాలక్రిష్ణ.. ఎందుకు?
- సంక్రాంతి పందెం కోళ్లు... వివిఆర్, ఎన్టీఆర్ కథానాయకుడు, పేట, ఎఫ్2... సెన్సార్ రిపోర్ట్ ఏంటి..?
- తెలుగు భాష వాడి.. తెలుగు నెత్తురు వేడి.. దేశమంతా తెలియాలి (Video)
నాగబాబు కామెంట్స్ గురించి బాలయ్య ఏమన్నారో తెలుసా..?(Video)
నందమూరి బాలకృష్ణ ఓ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు అనడం.. హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు కౌంటర్ ఇస్తుండడం.. ప్రస్తుతం వివాదస్పదం అవ్వడం అటు సినీ వర్గాల్లోను, ఇటు రాజకీయ వర్గాల్లోను చర్చనీయాంశం అయ్యింది. నాగబాబు బాలయ్యకు కౌంటర్‌గా వీడియోలు రిలీజ్ చేస్తుండటంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగబాబు కౌంటర్ పైన బాలయ్య అభిమానులు రియాక్ట్ అవుతున్నారు కానీ.. ఇప్పటివరకు బాలయ్య రియాక్ట్ కాలేదు.
ఇదిలావుంటే… ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా రిలీజ్ సందర్భంగా నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, డైరెక్టర్ క్రిష్ తదితరులు తిరుమలలోని వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ… సీఎంగా మొదటిసారి జనవరి 9న ఎన్టీఆర్ ప్రమాణస్వీకారం చేశారని, అదే రోజు ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని యాధృచ్చికంగానే విడుదల చేస్తున్నామన్నారు.
ఎన్టీఆర్ స్పూర్తితోనే సినిమాల్లోకి వచ్చానని, ఎన్టీఆర్ బయోపిక్ సినిమాతో తండ్రి రుణం తీర్చుకున్నానని తెలిపారు. అయితే.. నాగబాబు వ్యాఖ్యల గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బాలయ్య నో కామెంట్ అని బదులిచ్చారు. మరి..ఇప్పుడు అడిగితే నో కామెంట్ అన్నారు. మరో సందర్భంలో అడిగితే... అప్పుడు ఇదే చెబుతారో.. లేక తన స్పందన తెలియచేస్తారో. మొత్తానికి ఈ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఎంతవరకు వెళుతుందో చూడాలి. వీడియో చూడండి...
