గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 8 జనవరి 2019 (13:26 IST)

సంక్రాంతి పందెం కోళ్లు... వివిఆర్, ఎన్టీఆర్ కథానాయకుడు, పేట, ఎఫ్2... సెన్సార్ రిపోర్ట్ ఏంటి..?

ఎన్టీఆర్ జీవిత క‌థ ఆధారంగా క్రిష్ తెర‌కెక్కించిన‌ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు చిత్రంపై అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఎన్టీఆర్‌గా బాల‌కృష్ణ‌, బసవతారకంగా విద్యాబాలన్, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, సావిత్రిగా నిత్యా మీనన్, హరికృష్ణ‌గా కళ్యాణ్ రామ్, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్.. న‌టించ‌డంతో మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. ఈ మూవీ ర‌న్ టైమ్ 2 గంట‌ల 51 నిమిషాలు. ఈ చిత్రాన్ని చూసి సెన్సార్ సభ్యులు ఎటువంటి కట్స్ చెప్పకుండా క్లీన్ యు సర్టిఫికేట్ ఇచ్చారు. చ‌రిత్ర‌లో నిలిచేపోయే సినిమా ఇది అనేది సెన్సార్ టాక్. ఈ నెల 9న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 
 
త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన తాజా చిత్రం పేట‌. కార్తీక్ సుబ్బ‌రాజ్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత అశోక్ వల్లభనేని రిలీజ్ చేస్తున్నారు. రజ‌నీ ఈ సినిమా కోసం చాలా మేకోవర్ అయ్యారు. ఇదివరకు ఏ సినిమాలో కనిపించని విధంగా ఇందులో కొత్తగా ఉన్నారు. సిమ్రాన్, త్రిష, విజయ్ సేతుపతి, బాబీ సింహా, శ‌శికుమార్, మేఘా ఆకాష్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించ‌గా సన్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించింది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. ఈ మూవీ ర‌న్ టైమ్ 2 గంట‌ల 52 నిమిషాలు. ర‌జ‌నీకాంత్‌ను అభిమానులకు పండ‌గ‌లాంటి సినిమా అనేది సెన్సార్ టాక్. ఈ నెల‌ 10న ఈ సినిమా వ‌రల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.
 
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్- ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందిన‌ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ విన‌య విధేయ రామ‌. డి.వి.వి. ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యానర్ పైన భారీ చిత్రాల నిర్మాత దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఆల్రెడీ ఆడియోకు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో సినిమాపై మ‌రింత క్రేజ్ పెరిగింది. బాలీవుడ్ యాక్ట‌ర్ వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాలో విల‌న్‌గా న‌టించారు. స్నేహా, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్‌ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. సెన్సార్ బోర్డ్ ఈ మూవీకి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇక ర‌న్ టైమ్ విష‌యానికి వ‌స్తే..2 గంట‌ల 26 నిమిషాలు. చరణ్ యాక్షన్,  కైరా గ్లామర్, బోయ‌పాటి టేకింగ్, రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి అనేది సెన్సార్ టాక్. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా ఈ నెల 11న రిలీజ్ కానుంది. 
 
విక్ట‌రీ వెంక‌టేష్ - మెగా హీరో వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్లో యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన‌ చిత్రం ఎఫ్ 2. వెంకీ స‌ర‌స‌న త‌మ‌న్నా, వ‌రుణ్ స‌ర‌స‌న మెహ్రీన్ న‌టించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన అభిరుచి గ‌ల నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. ఫ్యామిలీతో హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంద‌నే టాక్ వ‌చ్చింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ర‌న్ టైమ్ విష‌యానికి వ‌స్తే.. 2 గంట‌ల 28 నిమిషాలు. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అంతా క‌లిసి ఎంజాయ్ చేసే సినిమా ఇది అనేది సెన్సార్ టాక్. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా ఈ నెల 12న రిలీజ్ కానుంది. ఈ విధంగా ఈ నాలుగు చిత్రాల‌కు సెన్సార్ టాక్ బాగానే ఉంది. మ‌రి..ఏ సినిమా బిగ్ హిట్ అవుతుంది అనేది చూడాలి.