శ్రీవారి ఆశీస్సులతో ఎన్టీఆర్ కథానాయకుడు రికార్డు సృష్టిస్తుంది... బాలయ్య(Video)
ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం రేపు.. అంటే జనవరి 9వ తేదీ విడుదల కాబోతోంది. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ పాత్రలో నటించిన బాలయ్యతో పాటు చిత్ర యూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హీరో బాలకృష్ణతో పాటు దర్శకుడు క్రిష్, హీరోయిన్ విద్యాబాలన్ మరో హీరో కళ్యాణ్ రామ్, సుమంత్‌లతో పాటు యూనిట్ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు.
వీరికి ఆలయ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు లడ్డు ప్రసాదం అందజేశారు. తిరుపతిలో మూవీ ప్రమోషన్ కోసం వచ్చిన కథానాయకుడు యూనిట్ మూవీ విజయవంతం కోసం శ్రీవారి ఆశీస్సులు పొందామని సినిమా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు హీరో బాలకృష్ణ.
ఈ సందర్భంగా బాలకృష్ణతో పాటు ఇతర నటులను చూసేందుకు ఆలయం ముందు అభిమానులు ఉత్సాహం చూపారు. చూడండి వీడియో...