శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 7 జనవరి 2019 (16:45 IST)

ఎన్టీఆర్ బ‌యోపిక్ నుంచి తేజ ఎందుకు త‌ప్పుకున్నాడో తెలుసా..?

నంద‌మూరి తార‌క రామారావు జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన సంచ‌ల‌న చిత్రం ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా ఈ నెల 9న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. అయితే... ఈ సినిమాకి ముందుగా ద‌ర్శ‌కుడు తేజ‌. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే... తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు త‌ప్పుకున్నాడు అనేది మాత్రం తెలియ‌దు. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా నంద‌మూరి బాల‌కృష్ణ మీడియాకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో బ‌య‌టపెట్టారు.
 
ఇంత‌కీ బాల‌య్య ఏం చెప్పారంటే... మేము చాలా పాజిటివ్ నోట్‌లో చాలా సానుకూల అంశాలతోనే ఈ బయోపిక్‌ని ప్రారంభించాం. కానీ... దురదృష్టవశాత్తూ, దర్శకుడు తేజ ఈ ప్రాజెక్టును హ్యాండిల్ చెయ్యలేనేమో అనే ఆలోచనలతో సినిమా నుండి తప్పుకున్నారని చెప్పారు. 
 
ఆ తరువాత ఈ ప్రాజెక్టుకి బాల‌య్యే దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నార‌ట‌. ఆ టైమ్‌లో క్రిష్ వచ్చి త‌ను డైరెక్ట్ చేస్తానని అవ‌కాశం ఇవ్వ‌మ‌ని అడిగారట‌. అప్పటికే బాల‌య్య‌తో గౌతమీపుత్ర శాతకర్ణి చెయ్యడం.. పైగా తన దర్శకత్వ శైలిపై బాల‌య్య‌కు ప్రగాఢమైన విశ్వాసం ఉండ‌డంతో... ఇంకేమి ఆలోచించకుండా వెంటనే క్రిష్ డైరెక్టర్‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసార‌ట‌. అదీ... సంగ‌తి!