గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 8 జనవరి 2019 (12:45 IST)

తెలుగు భాష వాడి.. తెలుగు నెత్తురు వేడి.. దేశమంతా తెలియాలి (Video)

నందమూరి తారక రామారావు బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్‌లో భాగంగా ''కథానాయకుడు'' పేరిట సినీ ప్రస్థానం.. ''మహానాయకుడు''గా ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం విడుదల కానున్న సంగతి తెలిసిందే.


తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన ఎన్టీఆర్.. తెలుగువారి కోసం పోరాటం చేసే ప్రోమో వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ కథానాయకుడు ప్రోమో-4ను సినీ యూనిట్ విడుదల చేసింది. 
 
తొలుత తెలుగు సినిమా ఇండస్ట్రీ మద్రాస్‌ను ఆధారంగా పనిచేస్తుంది. ఆపై హైదరాబాదుకు తెలుగు ఇండస్ట్రీ మారింది. ఇలా మద్రాసు నుంచి హైదరాబాదుకు తెలుగు సినీ ఇండస్ట్రీని మార్చడంలో ఏఎన్నార్, ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారు. 
 
తాజాగా విడుదలైన ప్రోమోలో తెలుగు సినీ ఇండస్ట్రీ కోసం ఎన్టీఆర్.. తెలుగు వారిని మద్రాసి అని ఎలా అంటారు. తెలుగువారికి సంస్కృతి, భాష వుందని ఎన్టీఆర్ ఈ ప్రోమోలో చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. ఇక ఎన్టీఆర్ బయోపిక్‌లో ఏఎన్నార్‌గా సుమంత్ నటిస్తున్నాడు. ఈ సందర్భంగా తెలుగు భాష వాడి.. తెలుగు నెత్తురు వేడి.. దేశమంతా తెలియాలంటూ.. ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. 
 
ఈ ప్రోమోలో తెలుగువారి కోసం ఎన్టీఆర్ పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. కాగా.. ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి తొమ్మిదో తేదీన రిలీజ్ కానుంది. తాజాగా ఎన్టీఆర్ ప్రోమో 4ను ఓ లుక్కేయండి.