శుక్రవారం, 21 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 9 జనవరి 2019 (09:09 IST)

బాలయ్య వర్సెస్ నాగబాబు : 'ఎర్రోడి వీరగాథ' పేరుతో వీడియో

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో బాలకృష్ణ - నటుడు నాగబాబుల మధ్య వార్ తీవ్రస్థాయికి చేరింది. బాలయ్య గతంలో చేసిన వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా 'ఎర్రోడి వీరగాథ' పేరుతో ఓ షార్ట్ ఫిల్మ్‌ వీడియోను రిలీజ్ చేశారు.
 
గతంలో ఓ కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ.. ఆడపిల్ల కనిపిస్తే "ముద్దైనా పెట్టాలా.. కడుపైనా చేయాలా" అన్నారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఈ షార్ట్ ఫిల్మ్‌ను విడుదల చేశారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తీసిన 'ఎన్టీఆర్ కథాయకుడు' అనే చిత్రం బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో 'ఎర్రోడి వీరగాథ' పేరుతో మూడున్నర నిమిషాల నిడివి ఉన్న వీడియోను విడుదల చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ వీడియోలో కొంతమండి మహిళలు ఓ వ్యక్తిని పట్టుకుని చితకబాదుతున్నారు. వారిని అడ్డుకున్న నాగబాబు.. ఎందుకు కొడుతున్నారని అతన్ని  ప్రశ్నిస్తాడు. దానికి అతని సమాధానం చెప్పాడు. ఆడపిల్ల కనబడితే ముద్దైనా పెట్టాలా.. కడుపైనా చేయాలా అని పెద్దలు చెప్పారని అందుకే ముద్దు పెట్టాలని ఓ అమ్మాయిని అడిగానని చెప్పాడు. దీంతో షాకైన నాగబాబు.. ఆడవాళ్లను పిలిచి మరీ చితక్కొట్టిస్తాడు.