శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 7 జనవరి 2019 (10:57 IST)

నాగబాబు.. బాలయ్య వివాదం.. పానకంలో పుడకలా వచ్చిన శ్రీరెడ్డి

నందమూరి హీరో బాలయ్య, మెగా బ్రదర్ నాగబాబు ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. మొన్నటికి మొన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే ఎవరో తనకు తెలియదని హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి హీరో బాలయ్య అంటే.. అందుకు కౌంటర్‌గా నాగబాబు కూడా బాలయ్య అంటే ఎవరో తెలియదన్నారు. ఈ వివాదం కాస్త సద్దుమణిగిన నేపథ్యంలో ట్విట్టర్‌లో నాగబాబు మళ్లీ బాలయ్యపై సెటైర్లు విసిరారు. 
 
ఎన్టీఆర్ బయోపిక్‌పై కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్‌తో మెగా ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ మధ్య నెట్టింట పెద్ద రచ్చ జరుగుతోంది. ఈ వివాదంలో తాజాగా వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ అంటూ పలువురిపై సంచలన ఆరోపణలు చేసిన నటి శ్రీరెడ్డి.. వీరి వివాదం నేపథ్యంలో చేసిన ఫేస్‌బుక్ పోస్ట్ వైరల్‌ అవుతోంది. 
 
జబర్దస్డ్ కామెడీ షో జడ్జి బాలయ్యబాబు ఫ్యాన్స్ అయితే చూడాల్సిన వీడియో అని కామెంట్‌తో శ్రీరెడ్డి వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో బాలయ్యను గెలుక్కోవడం వల్లే ఇలా కొట్టారని వుంది. వీడియోకు మాటలను జత చేసి జై బాలయ్య అంటే వదిలేస్తారని.. ఇకపైనైనా.. బాలయ్య జోలికి వెళ్ళొద్దనే విధంగా వుంది. శ్రీరెడ్డి వీడియో పోస్ట్‌కు మిశ్రమ స్పందన వస్తోంది. బాలయ్య ఫ్యాన్స్ సానుకూలంగా స్పందిస్తుంటే.. మెగా ఫ్యాన్స్ మాత్రం మెగా ఫ్యామిలీతో పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు.