బ్యాడ్మింటన్ డబుల్స్‌లో అదరగొట్టిన సీఎం మమతా బెనర్జీ
దేశంలో ఉన్న మహిళా ఫైర్‌బ్రాండ్ రాజకీయ నేతల్లో మమతా బెనర్జీ ఒకరు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రిగా, వెస్ట్ బెంగాల్ సీఎంగా ఉన్న ఈమె తనలోని క్రీడా ప్రతిభను దేశానికి చాటిచెప్పారు. అంతేకాకుండా, తమ రాష్ట్ర క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజెప్పేలా క్రీడామైదానంలో దిగి బ్యాడ్మింటన్ రాకెట్ చేతబట్టి ఫ్రెండ్లీ డబుల్స్ మ్యాచ్ ఆడారు.
బిబ్రూమ్ జిల్లా పర్యటనలోభాగంగా బోల్పూర్ గ్రామాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా 63 యేళ్ళ మమతా బెనర్జీ బ్యాడ్మింటన్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది వైరల్ అయింది. పైగా, ఈ ఫ్రెండ్లీ డబుల్స్ ఆటను ఆమె ఎంతో క్రీడాస్ఫూర్తితో ఆడటం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ వీడియోను మీరూ చూడండి.