శుక్రవారం, 22 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 13 జూన్ 2019 (18:48 IST)

మీడియా ఓవరక్షాన్.. చౌకబారు ప్రకటనలు అవసరమా? సానియా మీర్జా (video)

భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌పై ఇరు దేశాల మీడియాలు చౌకబారుగా ప్రకటనలు చేయడంపై భారత టెన్నిస్ స్టార్, పాకిస్థాన్ కోడలు సానియా మీర్జా ట్విట్టర్లో స్పందించింది.


గత రెండు వారాల పాటు జరుగుతున్న ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా భారత్-పాకిస్థాన్‌ల మధ్య జూన్ 16వ తేదీన మ్యాచ్ జరుగనుంది. సాధారణంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఉత్కంఠభరితంగా సాగుతుంది. 
 
అలాంటి వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో భారత్‌పై పాకిస్థాన్‌ గెలుపును నమోదు చేసుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఇండో-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్‌పై అభినందన్‌ను హేళన చేస్తూ వీడియో విడుదల చేసింది.

అలాగే స్టార్ స్పోర్ట్స్ కూడా పాకిస్థాన్ జాస్ టీవీపై సెటైర్లు వేస్తూ ప్రకటన చేసింది. ఇలా భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లపై ఇరు దేశాల మీడియాలు ఓవరాక్షన్ చేయడంపై క్రీడా పండితులు అసంతృప్తి వ్యక్తం చేశారు. 
 
ఇలాంటి ప్రకటనలకు అభ్యంతరం తెలుపుతూ భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా స్పందించింది. ఈ మేరకు తన ట్విట్టర్ పేజీలో ఇరు దేశాలకు మధ్య నెలకొన్న సున్నితమైన అంశాన్ని క్లిష్టతరం చేయవద్దని మీడియాను కోరింది.

క్రీడలపై ఇలాంటి ప్రకటనలు అవసరం లేదు. ఇంకా మీడియాపై సానియా మీర్జా ఫైర్ అయ్యింది. ఇలాంటి చౌకబారు ప్రకటనలు అవసరం లేదని.. క్రీడలను క్రీడల్లా చూడాలని హితవు పలికింది.