మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : బుధవారం, 19 జూన్ 2019 (14:08 IST)

మోర్గాన్ వరల్డ్ రికార్డ్ కొడితే.. చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్న రషీద్ ఖాన్..

ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తొమ్మిది ఓవర్లపాటు బౌలింగ్‌ చేసిన ఆప్ఘన్ స్పిన్నర్‌ ఒక్క వికెట్‌ కూడా తీయకుండా 110 పరుగులు ఇచ్చాడు. ఇది ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యంత చెత్త బౌలింగ్‌గా రికార్డు కావడం విశేషం. అలాగే వన్డేల్లో అయితే అత్యంత ఎక్కువ పరుగులిచ్చిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 
 
కాగా వరల్డ్ కప్‌కు ఆతిథ్య మిస్తున్న ఇంగ్లండ్ జట్టుతో తలపడిన ఆప్ఘనిస్థాన్‌కు ఇంగ్లీష్‌ కెప్టెన్‌ ఇయాన్‌మోర్గాన్ ‌(148; 71 బంతుల్లో 4×4, 17×6) విధ్వంసక బ్యాటింగ్‌తో చుక్కలు చూపించాడు. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ మోర్గాన్‌ వన్డేల్లో అత్యధిక(17) సిక్సులు కొట్టి ఈ మ్యాచ్‌లో మరో ప్రపంచరికార్డు నెలకొల్పాడు. ఇక ఇన్నింగ్స్‌ మొత్తంలో ఇంగ్లాండ్‌ జట్టు 25 సిక్సులు బాదింది. 
 
మోర్గాన్‌ సాధించిన 148 పరుగుల్లో బౌండరీల ద్వారానే 118 వచ్చాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు వరకూ అతడు వెన్నునొప్పితో బాధపడినా తొలుత ఆడతాడని అనుకోలేదు. అనూహ్యంగా బరిలోకి దిగి విధ్వంసం సృష్టించాడు. ఇతడి బాదుడుకి రషీద్‌ఖాన్‌ బలయ్యాడు. తొమ్మిది ఓవర్లపాటు బౌలింగ్‌ చేసి ఒక్క వికెట్ కూడా సాధించలేపోయాడు. ఫలితంగా 110 పరుగులిచ్చాడు. 
 
1983 ప్రపంచకప్‌(60 ఓవర్లు)లో న్యూజిలాండ్‌ బౌలర్‌ మార్టిన్‌ స్నెడ్డెన్‌ 12 ఓవర్ల పాటు బౌలింగ్‌ చేసి వికెట్లేమీ తీయకుండా 105 పరుగులిచ్చాడు. ఇదివరకు ఇదే చెత్త రికార్డుగా ఉండేది తాజాగా రషీద్‌ దీన్ని అధిగమించాడు.