సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : గురువారం, 6 జూన్ 2019 (12:38 IST)

ధోనీ తండ్రి అయ్యాడనే గుడ్ న్యూస్ అప్పుడొస్తే.. జీవాధోనీ ఇప్పుడు...?

దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ చేస్తుండగా.. ధోనీ కుమార్తె జీవా ధోనీ చేష్టలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.


మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ.. మరోవైపు ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ కొందరు గడిపారు. అలాంటి వారిలో జీవా కూడా వుంది. సోషల్ మీడియాలో సెలెబ్రిటీగా మారిపోయినా ధోనీ జీవా.. తన తండ్రి బ్యాటింగ్ చేస్తుండగా.. ధోనీ చేసిన చేష్టలు వైరలై కూర్చున్నాయి. 
 
గత 2015వ సంవత్సరం 50 ఓవర్ల వరల్డ్ కప్ పోటీలో ధోనీ నాయకత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లిన సంగతి తెలిసిందే. వామప్ మ్యాచ్‌లు జరిగేందుకు రెండు రోజులే వున్నాయి. ఆ సమయంలో ధోనీకి ఓ గుడ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే? ధోనీ తండ్రి అయ్యాడు. సాక్షి జీవా పండంటి పాపాయి (ధోనీ జీవా) పుట్టిందని. ఈ విషయాన్ని ధోనీ మీడియా ముందు ప్రకటించాడు.

అయినా తాను ప్రపంచ కప్ కోసమే ఆడటంపై దృష్టి పెడతానని తెలిపాడు. ధోనీ కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. కానీ ఆ తర్వాత ధోనీ కంటే జీవా ధోనీనే సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయింది. తండ్రిని పక్కకు నెట్టేసింది. తాజాగా జీవా ధోనీ చేష్టలు వైరల్ అయ్యాయి.