మంగళవారం, 7 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : బుధవారం, 5 జూన్ 2019 (18:46 IST)

#CWC19 : సౌతాఫ్రికా టాపార్డర్ ఢమాల్ - భారత్ టార్గెట్ 228

ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, సౌతాంఫ్టన్ వేదికగా భారత్ - సౌతాఫ్రికా జట్లు బుధవారం తలపడ్డాయి. ఈ మ్యాచ‌లో తొలుత టాస్ గెలిచిన సఫారీలు బ్యాటింగ్‌ను ఎంచుకున్నాయి. అయితే, భారత బౌలర్ల ధాటికి సఫారీ టాపార్టర్ కుప్పకూలింది. 
 
సఫారీ జట్టు ఆరంభంలోనే ఓపెనర్లు ఆమ్లా (6), డికాక్ (10) వికెట్లను 5.5 ఓవర్లకే కోల్పోయింది. ఆ తర్వాత మిడిలార్డర్ సైతం తడబాటుకు గురైంది. టీమిండియా స్పిన్నర్లు తమ సత్తా చాటడంతో కెప్టెన్ డుప్లెసిస్ (38), డుసెన్ (22)లు కూడా తడబాటుకు గురయ్యారు. వీరిద్దరినీ లెగ్ స్పిన్నర్ చాహల్ అవుట్ చేయగా, ప్రమాదకర డుమినీ వికెట్‌ను ఎల్బీడబ్య్లూ రూపంలో కుల్దీప్ యాదవ్ చేజిక్కించుకున్నాడు. 
 
అయితే, డేవిడ్ మిల్లర్, ఫెలుక్వాయో నిలకడగా ఆడి కొద్దిసేపు భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. అయితే, వీరిద్దరినీ చాహల్ ఔట్ చేయడంతో సౌతాప్రికా మరో కష్టాల్లో పడింది. దీంతో 89 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయింది. 
 
ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన టెయిల్ ఎండ్ ఆటగాళ్ళలో మోరిస్ (42) జట్టును ఆదుకున్నాడు. మరో బ్యాట్స్‌మెన్ రబడా(31 నాటౌట్)తో కలిసి మోరిస్ జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. 
 
ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో సఫారీలు 9 వికెట్ల వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. భారత బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లు తీయగా, బుమ్రా 2, భువనేశ్వర్ కుమార్ 2, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ చొప్పున తీశారు. ఫలితంగా భారత్ ముగింట 228 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.