శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : బుధవారం, 5 జూన్ 2019 (14:56 IST)

వరల్డ్ కప్ : టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. భారత్ బౌలింగ్

ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా భారత్ - సౌతాఫ్రికా మ్యాచ్‌ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఫలితంగా కోహ్లీ సేన బౌలింగ్ చేయనుంది. సౌతాంఫ్టన్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. 
 
ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. అలాగే, విజయ్ శంకర్‌ను పక్కనబెట్టి కేదార్ జాదవ్‌కు చోటు కల్పించింది. కేఎల్ రాహుల్ నాలుగో నంబరులో బ్యాటింగ్‌కు దిగనున్నాడు. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌లు ఆలౌండర్ల పాత్రను పోషించనున్నారు. 
 
అలాగే, సౌతాప్రికా కూడా ఇద్దరు స్పిన్నర్లతోనే బరిలోకి దిగుతోంది. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లూ ప్రకటించిన తుది జట్ల వివరాలను పరిశీలిస్తే, 
 
భారత్ : రోహిత్ శర్మ, శిఖర్ ధవాన్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, కేదార్ జాదవ్, ధోనీ, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ సింగ్. 
 
దక్షిణాఫ్రికా : డీ కాక్, ఆమ్లా, డుప్లెసిస్, వాన్డెర్ డుస్సెన్, డేవిడ్ మిల్లర్, జేపీ డుమినీ, అండ్లీ ఫెహ్లుక్వవో, క్రిస్ మోరిస్, కగిసో రబాడా, షంసీ, ఇమ్రాహన్ తాహీర్.