శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : గురువారం, 6 జూన్ 2019 (10:50 IST)

టీమిండియాను తలెత్తుకునేలా చేసిన ధోనీ.. ఇక్కడ చూడండి....

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ కీపింగ్ గ్లౌజ్‌పై వున్న గుర్తు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రపంచకప్ 2019లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య లీగ్ మ్యాచ్ బుధవారం సౌతాంప్టన్ మైదానంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు భారత్ జట్టు బౌలింగ్‌ ధాటికి కుదేలైంది. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 227 పరుగులు సాధించింది. 
 
తదనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 47.3 ఓవర్లలో 230 పరుగులు సాధించి.. విజయం సాధించింది. టీమిండియా ఆటగాళ్లలో రోహిత్ శర్మ 122 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా ఈ ప్రపంచకప్‌ సీజన్‌లో తొలి సెంచరీని నమోదు చేసుకున్న ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. 
 
ఈ నేపథ్యంలో భారత వికెట్ కీపర్ ధోనీ గ్లౌజ్‌లో వున్న ఓ గుర్తుపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే మొదలైంది. ధోనీ గ్లౌజ్‌పై వున్న గుర్తుకు సంబంధించిన ఫోటోలను భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ గుర్తు ఏమిటంటే.. భారత ఆర్మీ పారా స్పెషల్ ఫోర్స్‌కు చెందిన ముద్ర.
 
ఈ గుర్తును ధోనీ క్లౌజ్‌పై ముద్రించుకుని.. భారత దేశ గొప్పతనాన్ని చాటాడని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ధోనీ భారత సైన్యంలో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో వున్న సంగతి తెలిసిందే.