సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By మోహన్
Last Updated : గురువారం, 30 మే 2019 (13:38 IST)

మరోసారి క్రికెట్ గ్రౌండ్‌లో కనువిందు చేయనున్న సచిన్ టెండూల్కర్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పి ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం దాటింది. అయితే ఈ లెజండ్ క్రికెటర్ ఇప్పుడు కొత్త అవతారమెత్తాడు. ఇవాళ్టి నుంచి ప్రారంభం అవుతున్న వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు కామెంటేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో సచిన్ ఓపెన్స్ అగేన్ అన్న షో ప్రసారం కానుంది. 
 
ఇంగ్లండ్, సౌతాఫ్రికా మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌కు సచిన్ కామెంట్రీ ఇవ్వనున్నారు. లండ‌న్‌లోని ఓవ‌ల్ మైదానంలో ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. మ్యాచ్‌కు ముందు వ‌చ్చే ప్రీషోలో స‌చిన్ విశ్లేష‌ణ ఇవ్వ‌నున్నారు. మ‌ధ్యాహ్నం 1.30 నిమిషాల నుంచి ఆ షో ప్రారంభం అవుతుంది. 
 
హిందీ, ఇంగ్లీష్‌లో షో ఉంటుంది. అయితే సచిన్ షోలో మాజీ మేటి క్రికెటర్లు కూడా ప్యానెల్‌లో ఉంటారు. ఆరు సార్లు ప్రపంచకప్ ఆడిన సచిన్ మొత్తం 2278 రన్స్ చేశాడు. కాగా 24 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ జీవితంలో సచిన్ మొత్తం 34 వేల 357 రన్స్ చేశాడు.