అమ్మకానికి సచిన్ కుమారుడు.. రూ.5 లక్షలు పలికిన ధర
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్‌లో అన్ని రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునేందుకు ఆహర్నిశలు శ్రమిస్తున్నాడు.
ఈ నెల 14 నుంచి వాంఖడే స్టేడియంలో ట్వంటీ20 ముంబై లీగ్ ప్రారంభంకానుంది. ఇందుకోసం ఆటగాళ్ళ వేలం వేశారు. ఇందులో అర్జున్ టెండూల్కర్ రూ.5 లక్షలకు అమ్ముడుపోయాడు. లీగ్ రెండో సీజన్ కోసం జరిగిన వేలంలో ఆకాశ్ టైగర్స్ ముంబై వెస్టర్న సబర్బ్ యాజమాన్యం అర్జున్‌ను కొనుగోలు చేసింది.
లెఫ్టార్మ్ పేసర్, బ్యాట్స్‌మన్ అయిన అర్జున్ ఇండియా అండర్ 19లో అనధికారిక టెస్టులు ఆడుతున్న విషయం తెల్సిందే. ముంబై లీగ్ కోసం అర్జున్‌ను ఆల్ రౌండర్ కేటగిరీలో లక్ష రూపాయల కనీస ధరతో చేర్చారు. అయితే, నార్త్ ముంబై పార్ట్‌నర్స్ అతడిని బిడ్ గరిష్ట ధర అయిన రూ.5 లక్షలకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.