శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2019 (18:06 IST)

సచిన్‌ను కలుస్తాను.. పాకిస్థాన్ అబిద్.. ఇతనెవరు?

పాకిస్థాన్‌ స్వదేశీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన అబిద్ తన కెరీర్‌లో తొలిసారి ప్రపంచకప్‌లో ఆడబోతున్నాడు. ఇతను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వీరాభిమాని. సచిన్‌ను కలిసి త్వరలో బ్యాటింగ్ మెళకువలను తెలుసుకుంటానని చెప్పాడు.
 
సచిన్‌ను కలవాలన్నది తన చిరకాల స్వప్నమని చెప్పాడు. సచిన్ నుంచి మెళకువలను తాను నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తాడని భావిస్తున్నట్లు అబిద్ చెప్పుకొచ్చాడు. అతనిని కలిసిన రోజు తన జీవితంలో ప్రత్యేకమైన రోజు అని చెప్పాడు. 
 
సచిన్ టెక్నిక్స్ ఫాలో అవుతూ.. ఆడటం మొదలెట్టానని.. ఇంజమామ్ ఉల్ హక్, మొహమ్మద్ యూసుల్ మాదిరి సచిన్ గొప్ప ఆటగాడు. సచిన్ సాధించిన రికార్డులు చాలా గొప్పవని కొనియాడాడు. వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ వివియన్ రిచర్డ్స్‌ను కూడా కలుస్తా. ధీటుగా రాణించిన ఆటగాళ్లను కలుస్తానని వారి నుంచి ఆటతీరులోని మెళకువలను నేర్చుకుంటానని చెప్పుకొచ్చాడు.  
 
కాగా ఇటీవలే పాకిస్థాన్ జాతీయ జట్టులో అబిద్ స్థానం సంపాదించాడు. తన తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై సెంచరీ సాధించి అందరి అంచనాలు పెంచేశాడు. 31 ఏళ్ల అబిద్ సచిన్ వీరాభిమాని కావడం గమనార్హం.