గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2019 (18:28 IST)

భారత ప్రపంచకప్ జట్టు ఇదే.. రిషబ్ బంత్, అంబటి అవుట్... కార్తీక్, రాహుల్ ఇన్ (video)

ఇంగ్లాండ్‌లో వచ్చే నెలలో ఆరంభమ్యయే ప్రపంచకప్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కోహ్లీ నేతృత్వంలో భారత జట్టు ప్రపంచకప్ ఆడనుంది. అలాగే రోహిత్ శర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 
 
దినేష్ కార్తీక్, విజయ శంకర్, ధావన్, కేఎల్ రాహుల్, ధోనీ, కేదార్ చాహల్, పాండ్యాకు జట్టులో చోటు దక్కింది. ధోనీతో పాటు రెండో వికెట్ కీపర్‌గా దినేష్ కార్తీక్‌ను సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కి కూడా జట్టులో చోటు లభించింది.
 
ప్రపంచ కప్‌లో ఆడే జట్టు సభ్యుల వివరాలు..
 
విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), ధోనీ (వికెట్ కీపర్), రోహిత్‌ శర్మ (వైస్ కెప్టెన్), విజయ్‌ శంకర్‌, కేఎల్‌ రాహుల్‌, దినేశ్‌ కార్తీక్‌, శిఖర్‌ ధావన్‌, కేదార్‌ జాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్ యాదవ్‌, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ.