లసిత్ మలింగా భార్యకు ఏమైంది.. ఎందుకలా మాట్లాడుతోంది?

Last Updated: గురువారం, 31 జనవరి 2019 (13:18 IST)
జట్టు ఐక్యత ఆ జట్టు ఆటగాడు మలింగా భార్యతో లోపించే అవకాశం వుందని  పెరెరా సంచలన వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంక క్రికెటర్ మలింగా భార్య తన్యా పెరెరా.. తిషారా పెరెరా.. శ్రీలంక మంత్రి దయాదాక్షిణ్యాలతోనే జట్టులో కొనసాగుతున్నారని వివాదాస్పద ట్వీట్ చేశారు. దీంతో మండిపడిన తిషారా పెరెరా.. తాను మెరుగ్గా ఆడటంతోనే జట్టులో కొనసాగుతున్నానని చెప్పాడు. 
 
అయినా వదలని తన్యా పెరెరా.. మళ్లీ తిషారా పెరెరాను ఉసిగొల్పేలా ట్వీట్ చేశారు. ఇందుకు తిషారా పెరెరా స్పందిస్తూ.. మలింగా సతీమణి వ్యవహారంతో శ్రీలంక జట్టులో ఐక్యత లోపించే అవకాశం వుందని కామెంట్స్ చేశాడు. దీనిపై శ్రీలంక క్రికెట్ బోర్డు స్పందించాలని, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.దీనిపై మరింత చదవండి :