శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Modified: సోమవారం, 15 ఏప్రియల్ 2019 (18:30 IST)

పంత్‌ను పూచికపుల్లలా పక్కన పెట్టేశారు... ఎందుకని?

రిషబ్ పంత్‌కు ప్రపంచకప్ పోటీల్లో స్థానం లభిస్తుందని అందరూ అనుకున్నారు. ఐతే అతడిని సెలక్టర్లు పూచిక పుల్లలా తీసి పక్కన పెట్టేశారు. ఇలా ఎందుకు జరిగింది? కారణాలు ఏమిటి?
 
రిషబ్ పంత్ టెస్టుల్లో ఫర్వాలేదనిపించినా పొట్టి క్రికెట్లో మాత్రం ఫెయిలవుతున్నాడని సెలక్టర్లు భావించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న టీ-20 మ్యాచుల్లో పంత్ ఆటతీరు అద్భుతంగా ఏమీలేదు. ఏదో ఆడాడు అంటే... ఆడినట్లు అనిపిస్తున్నాడు. మరోవైపు కీపర్‌గా ఇంకా అతడు కుదురుకోవాల్సినది చాలానే వుందన్న భావనలో వున్నట్లు తెలుస్తోంది.
 
రిషబ్ పంత్‌తో దినేష్ కార్తీక్‌ను పోల్చినప్పుడు కార్తీక్ బెటర్ ఆఫ్షన్ అని అంతా భావించినట్లు అర్థమవుతుంది. కీలక సమయాల్లో దినేష్ కార్తీక్ ఎలాంటి తొట్రుపాటు లేకుండా నిలకడగా ఆడటం అతడికి ప్లస్ పాయింట్ అయ్యింది. ఇంకా కీపింగ్ చేయడంలోనూ దినేష్ కార్తీక్ - రిషబ్ పంత్ అన్నప్పుడు కార్తీక్‌కే అంతా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద వెంట్రుకవాసిలో పంత్ అవకాశాన్ని కోల్పోయాడు.