మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Updated : ఆదివారం, 31 మార్చి 2019 (16:44 IST)

మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన రిషబ్ పంత్?!

భారత యువ క్రికెటర్ అండ్ వికెట్ కీపర్‌ రిషబ్ పంత్ ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్2019 12వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు  తరపున ఆడుతున్నాడు. ఈ క్రికెటర్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. 
 
తాజాగా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న ఓ వీడియో సంచలనం రేపుతున్నది. వికెట్ల వెనుక ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేస్తూ బిజీగా ఉండే పంత్.. ఢిల్లీ, కోల్‌కతా మ్యాచ్‌లోనూ ఇలాగే ఓ కామెంట్ చేశాడు. అయితే ఇప్పుడదే అతడు ఫిక్సింగ్ చేశాడా అన్న అనుమానాలకు తావిస్తున్నది. 
 
కోల్‌కతా ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో పంత్.. బంతి పడే ముందే దాని ఫలితాన్ని అంచనా వేశాడు. "యే తో వైసీ భీ చౌకా హై" (ఇదెలాగూ ఫోర్ వెళ్తుంది) అని పంత్ అనడం స్టంప్ మైక్‌లో స్పష్టంగా వినిపించింది. అతడు అన్నట్లుగానే సందీప్ లామిచానె వేసిన ఆ తర్వాతి బంతిని కోల్‌కతా బ్యాట్స్‌మన్ రాబిన్ ఊతప్ప బౌండరీకి తరలించాడు. ఇప్పుడీ వీడియో చూసిన అభిమానులు సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు. మ్యాచ్ ముందుగానే ఫిక్సయిందని వాళ్లు ఆరోపిస్తున్నారు.