కోహ్లీకి కోపమొస్తే అమ్మో అంతే సంగతులు... రిషబ్ పంత్

Last Updated: సోమవారం, 25 మార్చి 2019 (13:33 IST)
టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌కు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటే భయమట. మామూలుగానైతే తాను ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని.. విరాట్ భయ్యా కోపమొస్తే మాత్రం భయపడతానని రిషబ్ పంత్ తెలిపాడు.
 
ఐపీఎల్‌‌‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడుతున్న పంత్, ఇటీవల మాట్లాడుతూ, మామూలుగానైతే తాను ఎవరికీ భయపడబోనని, అయితే, విరాట్‌ భయ్యాకు కోపమొస్తే మాత్రం భయపడతానని చెప్పాడు. 
 
తప్పు చేయని వారిపై కోహ్లీ ఎన్నడూ కోపగించుకోడని రిషబ్ పంత్ తెలిపాడు. ఎవరిపైనైనా కోహ్లీకి కోపం వచ్చిందంటే తప్పు చేసినట్టేనని రిషబ్ వ్యాఖ్యానించాడు. మనపై ఎవరికైనా కోపం వచ్చిందంటే, పొరపాట్లను గుర్తించి సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చిందని గుర్తించాలని రిషబ్ చెప్పాడు. దీనిపై మరింత చదవండి :