శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 20 మార్చి 2019 (14:33 IST)

బోర్డుపై మ్యాథ్స్ ఫార్ములాతో ప్రేమ పాఠాలు : అడ్డంగా బుక్కైన లెక్చరర్ (Video)

విద్యార్థులకు కూడికలు, తీసివేతలు చెప్పాల్సిన లెక్చరర్ ఒకరు బ్లాక్ బోర్డుపై ప్రేమ పాఠాలు చెబుతూ అడ్డంగా బుక్కయ్యాడు. ఈ విషయం కాలేజీ ప్రిన్సిపాల్ దృష్టికి వెళ్లడంతో ఇపుడు సస్పెండ్‌కు గురై ఇంటికి పరిమితమయ్యాడు. ఈ సంఘటన హర్యానా రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ కాలేజీలో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హర్యానా రాష్ట్రంలోని కర్నాల్‌లో ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీ ఉంది. ఇక్కడ చరణ్ సింగ్ అనే వ్యక్తి మ్యాథ్స్ టీచర్‌గా పని చేస్తున్నాడు. ఈయన ప్రేమ ఫార్ములాలు బ్లాక్‌బోర్డుపై చెబుతూ అడ్డంగా బుక్కయ్యాడు. సదరు లెక్చరర్.. ఈ కూడికలు, తీసివేతలు, ఫార్ములాలు అన్నింటినీ కలిపి.. దానికి తన క్రియేటివిటీని కాస్త జోడించి ప్రేమ పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు.
 
అతని ప్రేమ పాఠాలను ఓ విద్యార్థిని సెల్‌ఫోన్ కెమెరాలో చిత్రీకరించి ప్రిన్సిపల్‌కు చూపించింది. ఇంకేం.. వెంటనే సదరు లవ్ గురును సస్పెండ్ చేసి పారేశారు. నిజంగానే ఏదో మ్యాథ్స్ ఫార్ములా చెబుతున్నట్లుగా అతడు ఎంతో సీరియస్‌గా ఈ ప్రేమ ఫార్ములాలు చెబుతుంటే.. స్టూడెంట్స్ అందరూ నవ్వడం ఈ వీడియోలో చూడొచ్చు.