ప్రేమికుల రోజు స్పెషల్.. ఆయనకు 67 ఏళ్లు.. ఆమెకు 24 ఏళ్లు..
ప్రేమికుల రోజును పురస్కరించుకుని ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని ఈ జంట తేల్చేసింది. ఆయనకు 67 ఏళ్లైనప్పటికీ.. 24 ఏళ్ల యువతి పెళ్లి చేసుకుంది. ఈ లవ్‌స్టోరీ పంజాబ్‌లోనే పుట్టింది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్, ధూరి సబ్ డివిజన్ పరిధికి చెందిన బలియాన్ గ్రామానికి చెందిన షంపేర్ (67), నవ్‌ప్రీత్ కౌర్ (24)లు ప్రేమించుకున్నారు. వివాహం చేసుకోవాలనుకున్నారు.
రెండు కుటుంబాల పెద్దలు ఈ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో చండీఘడ్‌లోని గురుద్వారాలో జనవరిలో తమ మనసుకు నచ్చినట్లు వివాహం చేసుకున్నారు. వీరి జీవితం చిలకాగోరింకల్లా హాయిగా సాగిపోతుంది. అయితే పెద్దల నుంచి తమకు ప్రాణహాని వుందని.. కోర్టును ఆశ్రయించారు.
వీరి పిటిషన్ విచారించిన కోర్టు ఇద్దరూ మేజర్లు అయినందున ఇష్టప్రకారం పెళ్లి చేసుకుని జీవించే హక్కుందని, కావున నూతన జంటకు రక్షణ కల్పించాలని సంగ్రూర్, బర్నాలా జిల్లా ఎస్పీలను ఈ నెల 4వ తేదీన ఆదేశించింది. కాగా వీరి ప్రేమ, పెళ్లి వ్యవహారం ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.