మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 24 డిశెంబరు 2018 (19:23 IST)

పాయల్ రాజ్‌పుత్‌పై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్

పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం టాలీవుడ్‌లో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఆరెక్స్ 100 చిత్రంతో తెలుగు చిత్ర సీమకు ఎంట్రీ ఇచ్చిన పాయల్.. ప్రస్తుతం సి. కళ్యాణ్, రవితేజ సరసన నటించే ఛాన్సును కొట్టేసిన పాయల్.. తాజాగా బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన ''జీరో'' సినిమాపై పాయల్ చేసిన కామెంట్స్.. ఫన్నీ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
ఈ సినిమాను సాగదీసి చూపించారని.. ప్రేక్షకులు భరించడం కష్టమే అన్నట్లు కామెంట్స్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఒక్క హిట్ వస్తే స్టార్ హీరో సినిమాను కామెంట్ చేసే రేంజ్‌కి వెళ్లిపోయావా అంటూ ఫైర్ అవుతున్నారు. షారూఖ్‌పై చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఆమెపై నెగెటివ్ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.